- బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధీమా
- మనోహర్ రెడ్డి సమక్షంలో నేతల చేరిక
వేద న్యూస్, ఎలిగేడు:
పెద్దపల్లి నియోజకవర్గంలో మరోసారి ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన బత్తిని శ్రీనివాస్ తన వర్గీయులు, అనుచరులు, యువకులతో కలసి గురువారం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరినట్లు చెప్పారు.మనోహర్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి మండిగా రేణుక రాజనర్సు, ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బైరెడ్డి రాంరెడ్డి, మహేశ్వరరావు, ప్రసాద్ రావు, ఖలీల్, కొమురయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.