• టీ డబ్ల్యూ జే ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కే తిరుపతిరెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట:

జర్నలిస్ట్ ల సమస్యలు, వారి హక్కుల సాధన కు నిరంతరం పోరాటం చేస్తూ..ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తామని కరీంనగర్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షుడు కే తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం హుజరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘాలు ఏదైనా జర్నలిస్టుల సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని , జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా అందరూ ఏకతాటిపై నడిచి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని  సూచించారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ..ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా జర్నలిస్టులు తమ సేవలను అందించాలని చెప్పారు. అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(TWJF) సంఘంలో చేరిన పలువురు జర్నలిస్టులకు ఆయన సభ్యత్వాలు అందించారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గం లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంఘం బలోపేతానికి సభ్యులందరూ కూడా సహకరించి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ , ప్రధాన కార్యదర్శి అయిత రాధాకృష్ణ, ఫెడరేషన్ సభ్యులు న్యాయ పోరాటం సబ్ ఎడిటర్ సంధ్యల వెంకన్న , నవతెలంగాణ ఆర్ సి బొద్దుల రాజకుమార్, మనం పత్రిక రిపోర్టర్ దాము, జన సముద్రం సబ్ ఎడిటర్ పల్లె సతీష్, జన సముద్రం రిపోర్టర్ మట్టెల సంపత్, తెలంగాణ తేజ పత్రిక ఎస్ వెంకన్న, చంద్రమౌళి, చల్లూరి రాజు, తథాగత పత్రిక మొలుగు రమేష్, పలువురు రిపోర్టర్ లు పాల్గొన్నారు.