•  అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
పదిమందిని సంతోష పెట్టడమే నిజమైన పండుగ అని అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. దివ్యాంగులు, అనాథ పిల్లల మధ్య దీపావళి సంబురాలను డాక్టర్ అనితా రెడ్డి నిర్వహించారు.

హన్మకొండ లోని స్పందన బధిరుల అనాథ పిల్లల ఆశ్రయం పిల్లలతో, లార్డ్ వృద్ధ ఆశ్రయంలోని వృద్ధులతో జరుపుకున్నారు.

పండుగ సందర్భంగా పిల్లలకు దీపావళి టపాకాయలు, బాణాసంచా, స్వీట్లు అందజేశారు. పండుగ అంటే కేవలం మనం మాత్రమే సంతోషంగా ఉండటం కాదని, ఇలాంటి పిల్లల మద్య జరుపుకుంటే అది ఎంతో సంతృప్తినందిస్తుందని అనితారెడ్డి వెల్లడించారు. పిల్లలు కాకరపుల్లలు, భూచక్రాలు, చిచ్చు బుడ్లు వంటివి కాల్చుతూ ఆనందంగా కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.