- సూసైడ్ నోట్ లో ఇలా…
వేద న్యూస్,వరంగల్ క్రైమ్ :
నా చావుకు కనకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యామే కారణం…కస్టమర్ల నుంచి డిపాజిట్ చేయించిన డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో చనిపోతున్నాను..కనకదుర్గ చిట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారికి న్యాయం చేయాలని అంటు సూసైడ్ నోట్ రాసి కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజర్ నల్లా భాస్కర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజర్ నల్లా భాస్కర్ రెడ్డి సూసైడ్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. తన చావుకు కనకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యామే కారణమని సూసైడ్ నోట్ లభ్యమైంది.

అయితే, భాస్కర్ రెడ్డి ఏడాది కిందే ఉద్యోగం మానేశాడని సంస్థ చైర్మన్ చెప్పడం గమనార్హం.కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆర్థిక సమస్యలు, చిట్‍ఫండ్ పేమెంట్లే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు.