- ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ వైస్ చైర్ పర్సన్ అనితారెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అంధుల సెవ దైవ సేవ అని ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. గురువారం ఆమె లూయి బ్రెయిలీ జయంతి ఉత్సవాలలో భాగంగా వరంగల్ లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాలను సందర్శించారు.
అనంతరం వేడుకలలో పాల్గొని అంధ పిల్లలకు ఆత్మీయ స్పర్శను అందించారు, సంస్థ నిర్వాహకురాలు కళ్యాణి అధ్యక్షతన వేడుకలు జరగగా, డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి..కేక్ కట్ చేసి సంబురాలు ప్రారంభించారు.
అనంతరం అనితారెడ్డి మాట్లాడుతూ అంధులు చూపులేక పోయినా మనో నేత్రములతో చూడగలరని చెప్పారు. అత్యంత ప్రతిభ వీరికి ఉంటుందని, దానిని ప్రోత్సాహించాలని అన్నారు. ‘‘మేమున్నాం’’ అనే దైర్యం వారికి అందించాలని సూచించారు. పిల్లలతో చాలా సేపు సమయం గడిపి వారి సాదకబాదకాలు అడిగి తెలుసుకుని..అమ్మలా వారికి ఆమె ఆత్మీయ స్పర్శ అందించారు.