- రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
వేద న్యూస్, డెస్క్ :
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షలు, నమాజ్, తరావిః (ఖురాన్ పఠనం) జీవితంలో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని అన్నారు.
అల్లా దీవెనెలతో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలనీ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి ప్రార్థించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో గంగా జమున తెహజీబ్ మరింతగా పరిఢవిల్లుతుందని మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.