- గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ జరుపుల కాలునాయక్
- గురువుకు శిష్యుడి ఘన సన్మానం
వేద న్యూస్, డెస్క్:
ఉపాధ్యాయ వృత్తికి మించిన ఉద్యోగం లేదని గ్లోబల్ కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ కాలు నాయక్ జరుపు అన్నారు. కాజీపేట మండలంలోని రాంపూర్ హైస్కూల్ లో సట్టు సోమయ్య ఉద్యోగ విరమణ సమావేశంలో జడ్పీఎస్ఎస్ ఎల్లంపేటకు చెందిన ఆయన శిష్యులు జర్పుల.కాలునా యక్, మక్కా ఆంజన్ గౌడ్, కంచనపల్లి ఉపేందర్, లింగంపల్లి దయానంద్ , కొండం రమేశ్ బాబు, పగిండ్ల లక్ష్మయ్య, బానోత్ జగన్ , డీఎస్ జ్యోతి,డాక్టర్ రజిత కుమారి పాల్గొన్నారు.
బుధవారం వారు మాట్లాడుతూ సత్తు కాదు స్వర్ణమని ఈ సమాజానికి సందేశం ఇచ్చిన సౌమ్యలు సోమయ్య అని చెప్పారు. అందుకు నిదర్శనం కావాలంటే తామే నిదర్శనం అని పేర్కొన్నారు. వివిధ రంగాలలో స్థిరపడిన ఆయన పూర్వ విద్యార్థులం అయిన తామే సాక్ష్యం అని వెల్లడించారు.
సోమయ్య కేవలం తరగతి గదిలో 40 మందికి విద్యాబోధన చేసే ఉపాధ్యాయుడు కాదని సామాజిక ఉపాధ్యాయుడని కొనియాడారు. మేమందరం జీవితంలో స్థిర పడడం లో వారి పాత్ర కీలకమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం పూర్తిస్థాయిలో సామాజిక క్షేత్రంలో ఇంకా ఎంతో మంది జీవితాన్ని తీర్చిదిద్దాలని కోరుతున్నామని తెలిపారు.