వేద న్యూస్, వరంగల్ :

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైనది. 15 వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి మొదటి రోజు మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.

అలయెన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ (రిజిస్టర్డ్ పార్టీ) అభ్యర్థి గా అంబోజు బుద్దయ్య, ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థి గా బరిగెల శివ, పిరమిడ్ పార్టీ అఫ్ ఇండియా (రిజిస్టర్డ్ ఆన్ రేకగ్నైజ్డ్) పార్టీ అభ్యర్థిని గా తౌటపల్లి నర్మదా ఒక్కొ సెట్ చొప్పున వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు వేశారని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.