వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
ఒడిషా నుండి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న దంపతులతో పాటు ఒక మైనర్ -బాలుడిని ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి రూ.4లక్షల 70వేల విలువగల సూమారు 24కిలోల గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు సంబంధించి సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారి వివరాలను వెల్లడించారు. బీహర్ రాష్ట్రం, సరస్చప్రా జిల్లా చెందిన యోగేంద్ర రామ్ (30), వేదవతి దేవి (40) కొద్ది కాలంగా సహజీవనం చేస్తూ స్వగ్రామంలో రోజువారి కూలీ పనులు చేసేవారు. కూలీపనుల ద్వారా వచ్చే డబ్బులు వీరి అవసరాలకు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇదే సమయంలో బీహర్ రాష్ట్రం ఖట్సే ప్రాంతానికి గంజాయి అక్రమ రావాణా వ్యాపారి అయిన అఖిలేష్తో పరిచయం అయింది. ఈ పరిచయంతో నిందితులు మరో మైనర్ బాలుడితో కల్పి ఒడిషా రాష్ట్రంలోని బరంపుర గ్రామ పరిసరాల్లో తక్కువ ధరకు గంజాయిని కోనుగోలు చేసి అఖిలేష్ సూచనల మేరకు నిందితులు ముగ్గురు రైలులో ప్రయాణికులు వేషంలో ప్రయాణిస్తూ హైదరాబాద్ కు చెందిన అరవింద్ గంజాయి విక్రయదారుడికి గంజాయిని గత కొద్ది కాలంగా అందజేసేవారు. ఇందుకోసం పోలీసులు అరెస్టు చేసిన నిందితులు గంజాయి విక్రయదారులు ఐదువేల రూపాయలను అందజేసేవారు. ఇదే రీతిలో ఈ స్మగ్లర్ల ముఠా 24 కేజీల గంజాయి పదకొండు చిన్న చిన్న ప్యాకేట్లగా తయారు చేసి బ్యాగుల్లో రహస్యంగా భద్రపర్చుకోని ఒడిషా నుండి హైదరాబాద్ వెళ్ళే రైలులో ప్రయాణించే క్రమంలో పోలీసులకు అనుమానం రాకుండా వుండేందుకుగాను నిందితులు వరంగల్ రైల్వే స్టేషన్ దిగి హైదరాబాద్కు మరో రైలులో వెళ్ళేందుకు, రైల్వే స్టేషన్ ముందుగా అనుమానస్పదంగా తిరుగుతున్నట్లుగా ఇంతేజార్ గంజ్ పోలీసులకు సమాచారంతో స్థానిక రైల్వే ప్రోటేక్షన్ పోలీసుల సహకారంతో గంజాయి స్మగ్లర్ల ముఠా పోలీసులు అదుపులోకి తీసుకోని వారి బ్యాగులను తనీఖీ చేయగా బ్యాగుల్లో గంజాయిని గుర్తించి పోలీసులు నిందితులను అరెస్టు విచారణ నిమిత్తం ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ గంజాయి స్మగర్ల పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇంతేజార్ గంజ్ ఇన్స్స్సెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ కామురెల్లితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సెంట్రల్ జోన్ డిసిపి అభినందించారు.