వేద న్యూస్, వరంగల్: 

అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాలను దామెర మండల పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకెళితే.. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా టిప్పర్ లలో మొరం తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దామెర ఎస్ఐ కొంక అశోక్ మంగళవారం వెంటనే అక్కడికి చేరుకున్నారు. రెండు టిప్పర్లను  పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.