వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా టిఎన్జిఎస్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఐఏఎస్ ను కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ లో సోమవారం కలిసి.. పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని చూడడం సరి కాదని పేర్కొన్నారు.ఎనిమిది నెలల క్రితమే సాధారణ బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారని, తిరిగి మరల బదిలీలు చేయడం వల్ల కార్యదర్శులు అనేక ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు.
పాలకవర్గం ముగిసి ఏడాది గడిచిన పంచాయతీ ఎన్నికలు కాకపోవడంతో చాలాచోట్ల గ్రామాల అభివృద్ధి పనులకు ఆయా గ్రామాల కార్యదర్శులు పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టారని, వారు వేరే ప్రాంతానికి వెళ్తే వారు ఖర్చుపెట్టిన సొమ్ము వారికి అందడం కష్టమవుతుందని అన్నారు.
అట్టి డబ్బును వెంటనే ప్రభుత్వం నుంచి ఇప్పించవలసిందిగా కలెక్టర్ ను కోరారు.
పంచాయతీ కార్యదర్శుల బదిలీలను టీఎన్జీవోస్ యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొంటూ ఇట్టి విషయాన్ని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లి బదిలీల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చూస్తామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఇట్టి విషయంపై సానుకూలంగా స్పందించినారని,కార్య దర్శుల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పతకాల అమలులో అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూస్తు మరియు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, బదిలీల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేష్, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్,పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, వారి కార్యవర్గం, పంచాయతీ కార్యదర్శులు ఎం డి రఫీ, వెంకన్న, అంజలి,వెంకటేశం, ఉమకేశ్వర్,యాదగిరి, ప్రవల్లిక, లావణ్య ,యాక లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.