వేద న్యూస్, వరంగల్ : 

 

18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేసుకోవాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్-2024 (సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్) కార్యక్రమం లో భాగంగా శనివారం వరంగల్ లోని ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాల కళావేదిక హల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నోడల్ అధికారి మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని అన్నారు. 1 ఏప్రిల్ 2024లోగా 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినులు ఎపిక్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, కేవలం ఓటు మాత్రమే వేయడమే కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు ఓటు వేసే విధంగా వారిలో చైతన్యం తేవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్ఓ కోలా రాజేష్ కుమార్ గౌడ్ , లెక్చరర్లు మాలతి ,కృష్ణవేణి, అనురాధ, విజయ్, మోహన్ , తదితరులు పాల్గొన్నారు.