వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ :
ఆస్తి పన్ను పై 90శాతం వడ్డీ మాఫీ కి నేడే చివరి రోజని (మార్చి 31) ఇట్టి అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి బల్దియా వసూలు చేయాల్సిన పన్నుల లక్ష్యం రూ.92.95 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.68.03 కోట్ల వసూళ్లు అనగా 73.19 శాతం సాధించడం జరిగిందని అన్నారు. ఆదివారం రోజున కుడా బల్దియా వ్యాప్తంగా 12 ఈ సేవా కేంద్రాలతో పాటు రెవెన్యూ సిబ్బంది పన్నులు స్వీకరిస్తారని ప్రజలు ఇట్టి సదుపాయాన్ని వినియోగించుకొని పన్నులు చెల్లించాలని అదనపు కమిషనర్ కోరారు.