వేద న్యూస్, మిర్యాలగూడ రూరల్ :
మిర్యాలగూడ పట్టణం,చుట్టుపక్కల నిరుద్యోగ యువతనే లక్ష్యంగా చేసుకొని వారి యొక్క నిస్సహాయతను ఆసరాగా చేసుకొని, మోసపు మాటలు చెప్పిన కేటుగాళ్లు, వారి మాటలను నమ్మి బాధితుల నుండి డబ్బులు వసూలు చేసి వాళ్లకు జాబు వచ్చిందని మరికొద్ది రోజుల్లో జాబ్ లో జాయిన్ కావాలని ఫేక్ ఆర్డర్ కాపీలు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పివ్వకుండా మోసం చేసి సదరు బాధితులు డబ్బులు ఇవ్వమని అడగగా వారికి తిరిగి ఇవ్వకుండా చంపుతామని బెదిరించిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. వివరాల్లోకెళ్తే రాసపుత్ర రాఘవేందర్ పురఫ్ రాజు తండ్రి చంద్రశేఖర్ 42 సంవత్సరాల వయసు వృత్తి రైల్వేస్టేట్ నంద్యాల టౌన్ ఆంధ్ర ప్రదేశ్ చెందిన వ్యక్తి రాళ్లపల్లి శ్రీధర్ తండ్రి నారాయణ వయసు 36 సంవత్సరాలు వృత్తి గ్రామీణ ఉద్యోగ సేవ కేంద్రం వాసవి నగర్ మిర్యాలగూడ పట్టణం నల్గొండ జిల్లా లు తమ మాయ మాటలైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తూ మిర్యాలగూడలోని ఇంతియాజ్ అనే వ్యక్తి యొక్క ఇంటిలో ఒక సెటర్ ను గ్రామీణ ఉద్యోగ సేవ కేంద్రంగా తెరిచారు. వారిపై మిర్యాలగూడ పట్టణం సుందర్ నగర్ కు చెందిన వేముల వంశీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈనెల 3వ తేదీ న కేసు నమోదు చేయడం జరిగింది. నమ్మదగిన సమాచారం మేరకు శనివారం అదే ఆఫీసులో సదరు నిందితులైన ఎ2 రాసపుత్ర రాఘవేందర్ పురఫ్ రాజును, ఏ 3 రాళ్లపల్లి శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్,ఒక లక్ష 50 వేల రూపాయలు నగదు తో పాటు కొన్ని నిరుద్యోగుల రెస్యూమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా మరికొంత మంది పరారీలో ఉన్నారు. ఈ ముఠాను పట్టుకోవడం ప్రతిభ కనుపరిచిన మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎస్సై సైదిరెడ్డి, వారికి సహకరించిన సిబ్బందిని మిర్యాలగూడ డి.ఎస్.పి.కె రాజశేఖర్ రాజు అభినందించారు.పరారీ లో ఉన్న నిందితులను పట్టుకొని వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగులు కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఇలాంటి కేటుగాళ్ల మాయలో పడి సమయాన్ని ,డబ్బును వృధా చేసుకోవద్దని ఈ సందర్భంగా డిఎస్పి రాజశేఖర్ రాజు యువతకు సూచించారు.