వేద న్యూస్, వరంగల్:
నెక్కొండ మండలం సాయిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బండారుపల్లి శ్రీనివాసరావు చెంచారావు తండ్రి బ్రహ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి సొంటిరెడ్డి గురువారం అక్కడకు చేరుకున్నారు. మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, మండల కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, కెవి సుబ్బారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు దొడ్డ విజయ్, తాళ్లూరి నరసింహ స్వామి, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడియా తిరుమల్, చల్ల పాపిరెడ్డి ,సాయి రెడ్డి పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిచ్చ నాయక్, రవి సురేష్ కుమార్ లావుడియా రమేష్ తదితరులు పాల్గొన్నారు.