వేద న్యూస్, కమలాపూర్ : 

ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించవద్దని అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు మానేరు వాగు, పోతిరెడ్డిపల్లి, విలాసాగర్ గ్రామాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను కమలాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీజ్ చేశారు. ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లు అయినటువంటి వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామంచ పరశురాం, జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన ఆకు అశోక్, జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన రామంచ నాగరాజు లపై కేసు నమోదు చేసినట్లు కమలాపూర్ సిఐ తెలిపారు.