వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుడుతాడి రంజిత్, దేవకారి సిద్దేశ్వర్, పెండ్యాల ఐలయ్య, బొంకూరి ఐలయ్య, ఎండీ అసీనా అనే ఐదుగురు దివ్యాంగులుగా నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి..స్థానిక కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వారికి ట్రై సైకిళ్లు అందించాలని కోరారు.
వెంటనే స్పందించిన ఎంపీ సంజయ్ కుమార్ బండి.. వారికి ట్రై సైకిళ్లు అందిస్తామని చెప్పారు. కాగా, శుక్రవారం కరీంనగర్ నుండి తీసుకొచ్చిన ట్రై సైకిళ్లను నాయకులతో కలిసి బీజేపీ నాయకులు చిరంజీవి గ్రామంలోని దివ్యాంగులకు అందజేశారు.
త్వరలోనే వారికి బ్యాటరీ సైకిళ్లనూ అందిస్తానని ఎంపీ సంజయ్ తెలిపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రై సైకిళ్లు అందించిన బండి సంజయ్ కుమార్ కు దివ్యాంగుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కరుణాకర్, రాజు, నానాజీ, రాములు, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.