- టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్
వేద న్యూస్, ఎల్కతుర్తి:
రైతుభరోసా కింద ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ ఆ హామీలు నిలబెట్టుకోవా లని ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రైతు భరోసా’ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఆటో డ్రైవర్లు, కౌలు రైతులు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.