వేద న్యూస్, వరంగల్:
హనుమకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన తిప్పారపు సుధాకర్ భార్య కరుణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు, హనుమకొండ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షులు హింగే భాస్కర్ ఆదివారం సుధాకరర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించే తిప్పారపు కరుణ లేకపోవడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. కరుణ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో రైతులు, రజ్జి బాపూరావు, రాజేశ్వరరావు, శ్రీనివాసరావు దయాకర్ ,వీరన్న, తదితరులు పాల్గొన్నారు.