వేద న్యూస్, వరంగల్:

ఎల్కతుర్తి ఎస్ఐగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను తెలంగాణ రైతు రక్షణ సమితి(టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ ఆధ్వర్యంలో నేతలు కలిశారు. శనివారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి.. శాలువా తో సత్కరించారు.

ఎల్కతుర్తి ఎస్ఐ గా బదిలీ పై వచ్చిన ప్రవీణ్ కుమార్ కు శుభా కాంక్షలు తెలిపారు. ప్రజల అధికారిగా మంచి పేరు సంపాదించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీ ఆర్ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు కొక్కు తిరుపతి,నాయకులు కోదాటి మాధవరావు, నాంపెల్లి అశోక్, సుకినె సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.