- టీ డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే తిరుపతిరెడ్డి
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్ అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి యొక్క ముఖ్య డిమాండ్ అయిన హెల్త్ కార్డు, నివేషణ స్థలాలు, రైల్వే పాసులను పునరుద్దించలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫోర్త్ స్టేట్ అని చెప్పుకునే జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోతుందని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే కలం కార్మికులకు గుర్తింపు లేకుండా పోతుందని అన్నారు.
అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి టిడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తుందని అన్నారు.ఈ సమావేశంలో హుజరాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సౌడమల్ల యోహన్, ప్రధాన కార్యదర్శి అయిత రాదా కృష్ణ, భూపతి సంతోష్, అరికెళ్ల భానుచందర్ ఏబుసి సంపత్, సుధాకర్, ఖాజా ఖాన్, రవి కృష్ణ, సంతోష్, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.