వేద న్యూస్, వరంగల్ టౌన్ :

వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చాట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ సిటీ లోని పట్టణ పేదరిక నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రం ఆర్గనైజ్డ్ బై డాన్ బోస్కో నవజీవన్ లో నిరాశ్రయులైన వృద్ధులకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ట్రస్ట్ వృద్ధులకు భక్షాలు మరియు పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నిరాశ వృద్ధులకు ఉగాది ఆవశ్యకతతో పాటు వారికి సంతోషం కలిగించాలని ఉద్దేశంతో భక్షాలు మరియు పచ్చడి పంపిణీ చేయడం జరిగిందన్నారు. వృద్ధులు మాట్లాడుతూ మేముయుక్త వయసులో ఉన్నప్పుడు మా సంసార జీవనంలో ఇలాగే కుటుంబ సమేతంగా చేసుకునే వాళ్ళమని ఈరోజు వీరి ట్రస్టు ద్వారా ఇలా వచ్చి మాకు అందజేయడం చాలా సంతోషకరమైన విషయమని ఆనందదాయకమైనది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, ఇన్చార్జి వినయ్, నరసింహారావు, రవీందర్ కోఆర్డినేటర్ రాజు తదితరులు పాల్గొన్నారు.