వేద న్యూస్, హనుమకొండ:
శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేయి స్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.