– ధర్మారావుపేట గ్రామంలో సర్పంచ్, రెండు వార్డులు ఏకగ్రీవం
వేద న్యూస్, కాసిపేట:
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో 25 సంవత్సరాల తర్వాత సర్పంచ్ పదవి సహా రెండు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.స్థానికంగా శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్వగ్రామమైన ధర్మారావుపేటలో, ప్రేమ్ సాగర్ రావు వర్గం అభ్యర్థులు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వేయడంతో పోటీ లేకుండానే ఎన్నికలు ముగిశాయి.సర్పంచ్‌గా జుగ్నక రాధ మనోజ్ ఏకగ్రీవంగా ఎంపిక కాగా, వార్డు సభ్యులుగా పార్వతి పద్మపెద్దిరాజు ఆజ్మీర శ్రీవల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ ఏకగ్రీవ ఎన్నికలు సాధించడానికి కృషి చేసినందుకు ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గెలిచిన అభ్యర్థులు వెల్లడించారు.గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొని ఉండటంతో ప్రజలు ఏకగ్రీవ ఎన్నికలను స్వాగతించారు.