వేద న్యూస్, వరంగల్:
హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామంలో పారిశుధ్య నిర్వహణపైన ఎవరికీ పట్టింపు లేకపోవడంతో పరిసరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉన్నాయని వివరిస్తున్నారు. కనీసంగా వాటి నిర్వహణపైన ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి దృష్టి సారించడం లేదని ప్రజలు అంటున్నారు.
పారిశుధ్య నిర్వహణ అనేది అత్యంత కీలకమైన విషయము మరిచిపోయారా? అనే అనుమానాలను జనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పాలనలో స్పెషల్ అధికారి కానీ పంచాయతీ సెక్రెటరీ కానీ ఈ విషయాల పట్ల ఎందుకు దృష్టి సారించడం లేదని అడుగుతున్నారు. పరిసరాల అపరిశుభ్రత వల్ల గ్రామస్తులు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని, వెంటనే స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రెటరీ పారిశుధ్య నిర్వహణపైన తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.