- జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్
వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన నాయకులతో కలిసి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సందర్శించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఉప్పల్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోందని, ఈ బ్రిడ్జిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని అన్నారు.
ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ తాజా మాజీ శాసనసభ్యులు పట్టించుకున్న దాఖలాలు లేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాంతం నుంచి రోడ్డు మార్గాన రాకపోకలు సాగిస్తూ.. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
రైల్వే గేటు పడిన ప్రతీసారి గంటలు గంటలు వేచి ఉండవలసిన పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించి ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రయాణికుల రాకపోకల అంతరాలను తొలగించాలని ప్రజల పక్షాన వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి, చింతకింద బాలకృష్ణ, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.