వేద న్యూస్,సూర్యాపేట ప్రతినిధి :
వాసవి క్లబ్ లు ఎల్లప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాలలో ముందు వరసలో వుంటాయని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 104ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ కింద వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు వెంపటి రవితేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవికాలంలో వివిధ పనుల మీద పట్టణానికి వచ్చే బాటసారుల దాహాన్ని తీర్చడానికి వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి ప్రతి నెల అమావాస్య అన్నదానం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. వాసవి క్లబ్ లు మహిళలకు కుట్టు మిషను లను పంపిణీ చేయడం, పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, అల్పాహారం పంపిణి, వంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నాయని అన్నారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా బాటసారులకు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. చలివేంద్రం నిర్వహణలో నల్లపాటి శ్రీధర్, శ్రీకాంత్ లు తమ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ బిక్కుమళ్ల కృష్ణ, క్యాబినెట్ ట్రెజరర్ వెంపటి శభరినాధ్, ఆర్ ఎస్ యామా సంతోష్, ఆర్ సి గుమ్మడవెళ్లి శ్యామ్ సుందర్, తోట శ్యామ్ ప్రసాద్, సింగిరికొండ రవీందర్, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మయ్య, పబ్బతి వేణుమాధవ్, గుండా శ్రీధర్, మిర్యాల సుధాకర్, మిట్టపల్లి రమేష్, గుమ్మడవెళ్లి కృష్ణ, బెలిదె అశోక్ , శ్రీరంగం రాము, మాడుగుల మణికంట తదితరులు పాల్గొన్నారు.