వేద న్యూస్, వరంగల్ :
‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అనతి కాలంలో ‘వేద న్యూస్’తెలుగు దినపత్రిక అందరికి అందుబాటులోకి వచ్చి పాఠకుల మన్ననలను పొందిందన్నారు. వేద న్యూస్ లో ప్రచురించే కథనాలు చాలా బాగున్నాయని అభినందించారు . ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా వేద న్యూస్ దినపత్రిక పని చేయాలని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తన వంతు పాత్రను మీడియా తరఫున పోషించాలని సూచించారు. ప్రజా కోణంలో కథనాలు మలిచి ప్రజల పక్షాన నిలవాలన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ఎడిటర్ లింగబత్తిని కృష్ణ, జర్నలిస్టులు అజయ్, రవితేజ, కమల్, అఖిల్, కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.