వేద న్యూస్, వరంగల్:

 మర్రిపల్లి  శివారులోని శ్రీ రామభద్ర స్వామి గుట్ట వద్ద ప్రతి ఏడు హోలీ పర్వదినాన పురస్కరించుకొని నిర్వహించే రామభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మర్రిపల్లిగూడెం లోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నుండి రామభద్ర స్వామి ఉత్సావ విగ్రహాలను పురవీధుల గుండా ఊరేగింపుగా రామభద్ర గుట్ట వద్దకు భక్తుల కోలాహలం నడుమ 4 కిలోమీటర్లు పాదయాత్రగా తీసుకెళ్లారు.

 స్వామివారి కళ్యాణం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి గ్రామస్తులచే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

భక్తులు శనివారం  బండ్లు తిరుగుట స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. ఆదివారం రోజున తిరిగి స్వామి వారు దేవాలయ ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

జాతర సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక విద్యుత్ సరఫరాకు శ్రమించారు. జాతర సందర్భంగా మర్రిపల్లి గూడెం, మర్రిపల్లి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.