వేద న్యూస్, వరంగల్/కొత్తకొండ:
వీరభద్ర స్వామి జాతర బ్రహ్మోత్సవముల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపును మంగళవారం ప్రారంభించారు. మహిళ సేవా సమితి ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ హనుమకొండ జిల్లా పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్, భీమదేవరపల్లి ఎస్ఐ సాయిబాబా ఆధ్వర్యంలో పీసీ, హోంగార్డ్స్ వీరభద్ర స్వామి దేవస్థాన కార్యనిర్మాణ అధికారి పి.కిషన్‌రావు ఆధ్వర్యంలో కొత్తకొండ గ్రామ దేవస్థానం మాజీ చైర్మన్ మాజీ ధర్మకర్త కొం గొండ సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధమల్ల వెంకటేష్, పొదుపు సంఘం అధ్యక్షులు గాజుల సతీష్, కాంగ్రెస్ పార్టీ లీడర్ పూ ద రి రవీందర్ గౌడ్, బీజేపీ గ్రామ లీడర్ కంకల సదానందం, ఉప ప్రధానార్చకులు కంచనపల్లి రాజయ్య, ముఖ్య అర్చకుడు మొగిలిపాలెం రాంబాబు, ముఖ్య అర్చకుడు శ్రీకాంత్ తదితరులు కౌంటింగ్ లో భాగస్వాములయ్యారు.
భక్తకోటి కొంగు బంగారం కొత్తకొండ వీరన్న హుండీ ఆదాయ లెక్కింపులో విధులు నిర్వర్తించడం తమ సౌభాగ్యంగా భావిస్తున్నట్టు కౌంటింగ్‌లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ తెలిపారు.