వేద న్యూస్, హనుమకొండ :
శ్రీ యాదవ పరస్పర సహాయక సహాకార పరపతి సేవా సంఘం హంటర్ రోడ్,న్యూ శాయంపేట నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా మామిండ్ల రాజు,పిండి కట్టయ్య, సంఘ అధ్యక్షులుగా వేల్పుల రమేష్, ఉపాధ్యక్షులుగా పెరుగు రమేష్,మామిండ్ల కృష్ణమూర్తి,గండ్రకోట రాకేష్, ప్రధాన కార్యదర్శిగా పిండి రాజ్ కుమార్,సహాయ కార్యదర్శి గా కాశబోయిన రాజేష్,ముఖ్య సలహాదారులు మేకల రమేష్, పిండి రాజు, కోశాధికారిగా కాయిత అనిల్, మరియు కార్యవర్గ సభ్యులు గా పిండి రామన్,కాసాని యామిన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వేల్పుల రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్ష్య పదవిని కట్టబెట్టిన సంఘం సభ్యులకు రుణపడి ఉంటానని, యాదవ సామాజిక ప్రగతికోసం, అహర్నిశలు కృషి చేస్తానని మరియు సంఘ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళల పాటుపడుతానని హామీ ఇచ్చారు.