యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టాలి.

సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ డిమాండ్

వేద న్యూస్, వేములవాడ :

వేములవాడ పట్టణం నుంచి అయ్యోరుపల్లి, రామన్నపేట మధ్యలో ఈ మధ్యకాలంలోనే లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టిన సందర్భంలో అదే సమయంలో అక్కడున్న వ్యవసాయానికి సంబంధించిన రైతు ఆ రోడ్డు మధ్యలో నుంచి పైప్ లైన్ గురించి కందకం తవ్వడం వల్ల ఇప్పుడు ఈ రోడ్డు వెంబడి వెళ్లే ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకరంగా మారి, సాయంత్రం వేళల్లో ఆ గుంత దగ్గరికి వచ్చేదాకా కూడా ఏర్పడిన పరిస్థితులు దాపురించినాయి. ఎవరైతే ఆ రోడ్డు మధ్యలో నుంచి పైపు వేసిన రైతు మీద, చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్డు మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత రోడ్ల భవనాల శాఖ అధికార యంత్రాంగం మీద ఉంది కాబట్టి ఆ దిశగా మరమ్మతులు చేపట్టాలని వాహనదారుల పక్షాన,జిల్లా సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ పత్రిక ముఖంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.