వేద న్యూస్, నల్లగొండ :
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగంపై జరిగిన చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది. మా పదిహేను నెలల పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమాభివృద్ధి ఫలాలు అందించడం జరిగింది. వచ్చిన ఆరు నెలల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. యాబై ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.
మాకు బీఆర్ఎస్ నేతల లెక్క మాటలు ఎక్కువ రావు.వాళ్ల మాదిరిగా మేము మాటలు చెప్పము.. పదేండ్లు మాటల గారడీతోనే వాళ్లు పరిపాలనను కొనసాగించారు. వాళ్ల మాటల గారడీని.. అవినీతి అక్రమాలకు విరక్తి చెంది ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా మమ్మల్ని గెలిపించారు. మమ్మల్ని ఇటు వైపు ..బీఆర్ఎస్ ను అటువైపు కూర్చోబెట్టారు అని వ్యాఖ్యానించారు.
నా మాటల దాటికి..నేను అడిగిన ప్రశ్నలకు మైండ్ బ్లాంక్ అయి అసెంబ్లీ నుండి బయటకు వెళ్లారు..మాకు మాట్లాడటం తక్కువగా వచ్చు.. పని చేయడం ఎక్కువగా వచ్చు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు..