వేద న్యూస్, ఎల్కతుర్తి:

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో మండల పరిధిలోని వీరనారాయణ్ పూ ర్, సూరారం, చింతలపల్లి గ్రామాలల్లో బూత్ కమిటీల వెరిఫికేషన్ కంప్లీట్ చేసినట్టు చిరంజీవి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా అన్ని గ్రామాల బూత్ కమిటీలు కలిసి కట్టుగా పని చేయాలని బూత్ కమిటీల సభ్యులకు సూచించినట్టు పేర్కొన్నారు. కరీంనగర్ గడ్డా బండి సంజయ్ అడ్డా అని ధీమా వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ బీజేపీ వేవ్ ఉందని, ఈ సారీ కేంద్రంలో అధికారంలోకొచ్చేది కాషాయ పార్టీనేనని జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని, రాబోయే ‘లోక్ సభ’ ఎన్నికలలో ఎన్డీఏకు 400కు పై చిలుకు సీట్లు లభిస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లెపాటి మధుకర్, నార్లగిరి వెంకటేష్, చదిరం రాకేష్, మిట్టపల్లి మధు, నాగరాజు, అంచనగిరి వెంకట్, కుడుతాడీ కరుణాకర్, కుడుతాడి రాజు, మోహన్ రావు, ఆదర్శ్, నానాజీ, రాములు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.