వేద న్యూస్, వరంగల్:

వరంగల్ నగరంలోని కీర్తి గార్డెన్ లో హిందువుల సంరక్షణ కోసం త్రిశూల్ దీక్ష బుధవారం నిర్వహించారు.   ఈ దీక్షలో పాల్గొనేందుకు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కరీమాబాద్ బొమ్మలగుడి  నుంచి పలువురు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.  కార్యక్రమంలో గోగికార్ అనిల్ కుమార్, గొడిశాల కార్తీక్, అరవింద్, బైరి అఖిల్, రాఘవ, ప్రతీక్, నిఖిల్, భరత్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.