వేద న్యూస్, ఫోకస్ టీమ్:
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనూహ్యంగా రాములమ్మ అలియాస్ విజయశాంతి పేరు తేరు మీదకు రావడమే కాదు ప్రకటన కూడా వచ్చేసింది. ఈ విషయమై వేద న్యూస్ తెలుగు దినపత్రిక చెప్పింది అక్షరాల నిజమైంది. ఈ నెల 7న ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ‘ఎమ్మెల్సీ రేసులో రాములమ్మ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. తాజాగా ఆదివారం ఏఐసీసీ విడుదల చేసిన ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ లిస్టులో విజయశాంతి పేరుండటం విశేషం.
