..

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలోని కోదురుపాక గ్రామ ప్రజలు తనను ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని మండల పరిధిలోని కోదురుపాక గ్రామ సర్పంచి అభ్యర్థిగా బోలుమాల లక్ష్మి శంకర్, నామినేషన్ దాఖలు చేశారు. కోదురుపాక గ్రామ పంచాయతీ దగ్గర నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బోలుమల లక్ష్మి శంకర్, మాట్లాడుతూ గ్రామంలో సమస్యల పై గ్రామ శాఖ ఆధ్వర్యంలో కృత నిశ్చయంతో రాజీలేని అభివృద్ధి చేసి చూపిస్తానని కోదురుపాక గ్రామ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆయనతో పాటు వార్డు నెంబర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువత, తదితరులు పాల్గొన్నారు.