- అనాథాశ్రమ పిల్లలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
వేద న్యూస్, వరంగల్:
ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా బుధవారం వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ ఐఈఈఈ, సీఎస్ఈ(డేటా సైన్స్) డిపార్ట్ మెంట్ వారు ..కేరింగ్ హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్ బ్రాంచ్ కౌన్సెలర్ బి.నాగరాజు, వాలంటీర్లు లవణ్ కుమార్ అడ్డూరి, వరంగల్ లో మదర్ థెరిసా, స్పందన అనాథాశ్రమాలను సందర్శించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు సహాయం చేశారు. వారికి ఫ్రూట్స్, స్నాక్స్ అందించారు.
న్యూ ఇయర్ సందర్భంగా పిల్లలతో హాయిగా కాసేపు టైం స్పెండ్ చేశారు. స్పందన మనసిక వికలాంగుల కేంద్రానికి వెళ్లి అక్కడ పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పిల్లలకు తమకు తోచినంతలో సాయం చేస్తూ.. వారితో వేడుకలు జరుపుకోవడం తమకు సంతృప్తిని ఇచ్చిందని ఈ సందర్భంగా వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ ఐఈఈఈ, సీఎస్ఈ(డేటా సైన్స్) మెంబర్స్ వెల్లడించారు.