వేద న్యూస్, డెస్క్ :
విశిష్ట సేవలే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్లు మేడారం జాతరలో పని చేస్తున్నారు.
జాతరలో ఏటూరు నాగారం మల్యాల నుండి బుధవారం మేడారం జాతర పరిసర ప్రాంతాలు భక్తుల సేవలకై 26 మంది జూనియర్ వాలంటీర్ కార్యక్రమాల ద్వారా భక్తులకు విశిష్ట సేవలు ప్రారంభమయ్యాయి.
జాతర పరిసర ప్రాంతాలలో సెక్టార్కు క్యూ లైన్ లలో భక్తుల సేవలతో పాటుప్రమాదవశాత్తు అత్యవసర పరిస్థితులు యందు ప్రజలకు సహాయం చేయడానికి వీళ్లు అందుబాటులో ఉంటారు.సమ్మక్క సారలమ్మ గద్దెలకు వచ్చేటప్పుడు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ కార్యకలాపాలను సాగిస్తారని రెడ్ క్రాస్ చేపట్టే అన్ని కార్యకలాపాలకు వాలంటీర్లు వెన్నెముకగా ఉంటారనీ చెప్పుకోవచ్చు.