- ‘ఇంటింటి ప్రచారం’లో ప్రజలకు బీజేపీ నేతల అభ్యర్థన
వేద న్యూస్, వరంగల్:
కమలం పువ్వు గుర్తుకు ఓటేసి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే గా ఎర్రబెల్లి ప్రదీప్ రావును గెలిపించాలని ప్రజలను బీజేపీ ముఖ్య నేతలు కోరారు. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్ లో నాయకులు ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కాషాయం పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చిందని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు పూదరి అజయ్ గౌడ్, గోడిశాల కార్తిక్, పూదరి పద్మ, మధురబోయిన రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.