- నేషనల్ కన్జూమర్ రైట్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ అనితారెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యత అని, రాజ్యంగం కల్పించిన ఈ హక్కు ను అందరూ వినియోగించుకోవాలని ది నేషనల్ కన్జుమర్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ సొసైటీ ప్రసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. అవినీతిని సూటిగా ప్రశ్నించే ధెర్యం కావాలంటే ఓటు వేయాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. గురువారం ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటు వేసే సమయం మనకు లేనప్పుడు .. హక్కులు అడిగే అధికారము కూడా ఉండబోదని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
