- విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున బరిలో అభ్యర్థి సందీప్
- మార్పు కోసం బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరిన కొంగంటి
వేద న్యూస్, హుస్నాబాద్:
రాష్ట్రంలో ఎన్నికల పర్వం తుదిదశకు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన వీఆర్పీ(విద్యార్థుల రాజకీయ పార్టీ) తరఫున ఓ యువకుడు బరిలో దిగారు. విద్యావంతుడినైన తనను ప్రజలు ఆదరించాలని కోరుతున్నారు. బ్యాట్ గుర్తుకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.
ప్రచారంలో విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి చక్కటి స్పందన వస్తోందని వివరిస్తున్నారు. ప్రతీ ఇంట్లో ఒక నిరుద్యోగి ఉండగా, వాళ్లు తమ తల్లిదండ్రులకు అర్థమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు వివరిస్తు్న్నారని అంటున్నారు. తొమ్మిదేళ్లుగా విద్యార్థి లోకం కష్టపడుతూనే ఉందని, ప్రతీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూనే ఉందని ఈ విషయాలను ప్రజలు గుర్తించాలని అభ్యర్థి సందీప్ సూచిస్తున్నారు.
తెలంగాణ కోసం ఎక్కువ కష్టపడ్డది విద్యార్థులే..కాగా, తెలంగాణ వచ్చాక కూడా ఎక్కువ నష్టపోయింది విద్యార్థులేనని ప్రచారంలో ప్రజలకు విస్పష్టంగా వివరిస్తున్నారు.విద్యార్థులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కూడా..పిల్లల బంగారు భవిష్యత్ కోసం ప్రజానీకం వీఆర్పీ వైపు చూడాలని, క్రికెట్ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. చూడాలి మరి..ప్రధాన రాజకీయ పార్టీల హోరాహోరీ పోరులో వీఆర్పీ అభ్యర్థి సందీప్ ఏ మేరకు ప్రభావం చూపుతారో..