వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో పుష్యమాసం శుక్లపక్షం సప్తమి నాడు ఆదివారం వ్యాసభగవానుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేశారు. సరస్వతి మాత మందిరముకు కొత్తగా రూపురేఖలు దిద్దారు.

ఈ మహోత్తరమైన కార్యక్రమంలో పాఠశాల సమితి అధ్యక్షుడు, ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాసరెడ్డి ,వారి కుటుంబ సభ్యులువిగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తర్వాత హోమంలో పాల్గొన్నారు . అలాగే ఈ కార్యక్రమంలో పాఠశాల సమితి సభ్యులు, ప్రబంధకారిణి సభ్యులు పలువురు పెద్దలు, ఆచార్యులు, మాతాజీలు పాల్గొన్నారు.విద్యార్థి నులు విద్యార్థులు చాలా చక్కగా భజన చేశారు.

ఈ కార్యక్రమాన్ని పురోహితులు ఖపర్తన్ విజయవంతంగా నిర్వహించారు.