వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఏఐసీసీ సెక్రటరీ, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ ను వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో రామకృష్ణ బృంద సభ్యులు..సంపత్ ను కలిసి..వరంగల్ ఎంపీ టికెట్ రామకృష్ణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజాసేవకుడిగా, కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా జిల్లాలో, రాష్ట్రంలో దేశంలో కూడా మంచి పేరున్న రామకృష్ణకు టికెట్ కేటాయిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున..ప్రజా సంఘాలు కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీ గెలుపులో తోడుంటారని రామకృష్ణ బృంద సభ్యులు పేర్కొన్నారు.

ఈ విషయం ఏఐసీసీ సెక్రెటరీకి తెలిపారు. ఏఐసీసీ సెక్రెటరీ సానుకూలంగా స్పందించినందుకు డాక్టర్ రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.