వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులతో పాటు వీరికి సహకరించిన మరో నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు సుమారు 1,60,000 (లక్ష అరవై వేల రూపాయలను) రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టు సంబంధించి మామూనూర్ ఏసీపీ వెంకటేశ్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల మధ్య గతంలో పరిచయం వుండడంతో వీరికి వచ్చే అదాయం వీరూ చేసే జల్సాలకు సరిపోకపోవడం వలన నిందితులందరు కలసి గతంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడటంతో పాటు ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడటంతో పోలీసులు అరెస్టు చేసిన పలుమార్లు జైలుకు తరలించడం జరిగింది. నిందితులందరు జైలు నుండి విడుదల అయిన అనంతరం వారిలో ఎలాంటి మార్పు రాకపోగా, ఇండ్లల్లో చోరీలకు పాల్పడం ద్వారా పోలీసులకు చిక్కడం జరుగుతోందిని భావించి నిందితులు తమ పంథాను మార్చుకోని గ్రామాల్లో వుండే గొర్రెలను చోరీ చేసి వాటిని విక్రయించడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించ వచ్చని నిందితులు నిశ్చయించుకుని నిందితులు అనుకున్న ప్రకారం ముందుగా గ్రామాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో సెల్ఫ్ డ్రైవ్ కారులను కిరాయికి తీసుకొని ఆ కార్లల్లో వచ్చి తాము ముందుగా అనుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ వున్న గొర్రెలను దొంగిలించి కారులోకి ఎక్కించుకోని అక్కడి నుండి తప్పించుకోని పారిపోయేవారు. చోరీ చేసిన గొర్రెలను నిందితులు వర్ధన్న పేట ప్రాంతానికి చెందిన మాంస వ్యాపారం చేసే అంగడి వెంకన్నకు విక్రయించే వారు. నిందితులు ఇదే తరహలో నాలుగు (4) గొర్రెల దొంగతనాలు పాల్పడ్డారు. ఇందులో గీసుగొండ, మామూనూర్, మిల్స్ కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో పాల్పడ్డారు. అంతేకాక గీసుకొండ పరిధిలో కొమ్మాల గ్రామ శివారులో ఇంట్లో ఎవరూ లేని ది గమనించి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న రూ.1,05,000 దొంగిలించారు. అంతేకాక మామునూరు పరిధిలో నీ బొల్లికుంట గ్రామంలో రాత్రి వేళలో ఇండ్లలలో ఎవరూ లేనిది గమనించి రెండు ఇలా తాళాలు పగలగొట్టి కొంత డబ్బులను దొంగిలించినారు.
గీసుకొండ పరిధిలో జరిగిన చోరీలపై ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదు చేసుకున్న గీసుగొండ్ పోలీసులు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని దర్యాప్తు చేపట్టి పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా గీసుగొండ పోలీసులు ఉకల్ హవేళి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమాస్పదంగా వస్తున్న రెండు కార్లను పోలీసులు అపివేసి కార్లలో తనిఖీ చేయగా కార్లలో గొర్రెల మలంతో పాటు, వాటి జుట్టు కారులో గుర్తించి పోలీసులు కారులో ప్రయాణిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు గొర్రెలను చోరీలకు పాల్పడి వాటిని విక్రయించేవారమని నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించి అలా అమ్మగా వచ్చిన డబ్బు ఇదేనని నేరానికి పాల్పడగ వచ్చిన డబ్బులను పోలీసులు స్వాధీనపరచుకొని అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితులను పట్టు కోవడంలో ప్రతిభ కనబరిచిన గీసుగొండ ఇన్స్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్, ఎస్.ఐ కె. కుమార్, కానిస్టేబుళ్ళు విజయ్, అరవింద్, సాయి, హరి, రజని కుమార్ మరియు ఇతర సహకరించిన సిబ్బందిని మామూనూర్ ఏసీపీ అభినందిస్తూ తగిన శాఖపరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలియజేశారు.