వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట:

మండలంలోని రాగట్లపల్లె గ్రామంలో శనివారం వాటర్ ప్లాంట్ ను ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాగట్లపల్లె గ్రామానికి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

గ్రామస్తులందరూ ఈ ప్లాంట్ ను వినియోగించుకోవాలని కోరారు. ముందు ముందు తన వంతుగా మరింత సాయం చేస్తానని తెలిపారు. అనంతరం జడ్పిటిసి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ గ్రామంలో ఏళ్ల నాటి నుంచి మంచినీటి సమస్య ఉందని తెలిపారు. దాన్ని గుర్తించి సాయం చేసిన వెంకట్ రెడ్డిని ప్రశంసించారు.

అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ వెంకట్ రెడ్డి ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి సుజాత-మహేందర్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మందాటి రాము, సీనియర్ నాయకులు మందాటి మల్లేష్, మందాటి సతీష్, మందాటి లక్ష్మణ్, మానుక సురేష్, నాగం మల్లేష్, నెత్తట్ల శ్రీనివాస్, మానుక మహేష్, మంద నాగరాజు, మందాటి నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.