- కోరమాండల్ సంస్థ నిర్వాహకులు
వేద న్యూస్, ఎలిగేడు:
రైతుల సమృద్ధికి మార్గం వేస్తున్నామని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలకేంద్రంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమెటెడ్ (మన గ్రోమోర్) సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మండలకేంద్రానికి చుట్టు పక్క ఉన్న రైతుల పంట చేనుల వద్దకు వెళ్లి పంట విషయమై సూచనలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
రైతులకు కావలసిన ఎరువు బస్తాలను సరసమైన ధరలకే అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సంస్థ తరఫున నాణ్యమైన ఎరువులు, పెస్టిసైడ్స్ అందజేస్తున్నట్లు వివరించారు.
ఒక ఆధార్ కార్డు రెండు బస్తాలే ఇస్తున్నామన్న ప్రచారం వాస్తవం కాదని తెలిపారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమెటెడ్ (మన గ్రోమోర్) సంస్థ రైతులకు ఉచిత భూసార పరీక్షలు చేసి పంట విషయమై అన్నదాతకు తగిన సలహాలు, సూచనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.