వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సాంస్కృతిక సారధి కళాకారులు గురువారం తెలిపారు. ఈ మేరకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో టి ఎస్ ఎస్ కళాకారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో కళాకారుల సంఘం నాయకులు దారా దేవేందర్, గిద్దే రామ్ నర్సయ్య, రామంచ భరత్, బుచ్చన్న, శివ, సునీల్, రజియా ఉమ్మడి జిల్లా కళా కారులు పాల్గొన్నారు.
