వేద న్యూస్, వరంగల్ జిల్లా:
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వర్దన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపుపొందిన ఎమ్మెల్యేలను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య ఆధ్వర్యంలో కమిటీ బాద్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
గెలుపొందిన ఎమ్మెల్యే లకు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలను కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి మాట్లాడుతూ జర్నలిస్టులతో ఎల్లప్పుడూ స్నేహసంబంధాలు కొనసాగుతాయన్నారు. గ్రేటర్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రెస్ క్లబ్ కమిటీ ఆహ్వానం మేరకు త్వరలో ప్రెస్ క్లబ్ కు వస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ కోశాధికారి బోళ్ల అమర్ , వైస్ ప్రెసిడెంట్లు గోకారపు శ్యాం, బొడిగె శ్రీనివాస్, అల్లం రాజేశ్ వర్మ, జాయింట్ సెక్రటరీలు సంపెట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్దన్, కార్యవర్గ సభ్యులు వీరగోని హరీశ్, దొమ్మటి శ్రీకాంత్, జె.ఆంజనేయులు, నయీంపాష, కమటంవేణుగోపాల్, మంచాల రాజు పాల్గొన్నారు.