• ప్రజలకు బీఆర్ఎస్ నాయకుల అభ్యర్థన

వేద న్యూస్, మరిపెడ:
అభివృద్ధిని గుర్తించి కారు గుర్తుకు ఓటేసి డోర్నకల్ ఎమ్మెల్యేగా రెడ్యా నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను బీఆర్ఎస్ నాయకులు కోరారు. బుధవారం వారు మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం ఎస్సీ కాలనీ 10, 11వ వార్డులలో గడపగడపకు విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న సంక్షేమపథకాలను వివరించారు. కాంగ్రెస్ వాళ్లు 60 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతీ కుటుంబానికి బీఆర్ఎస్ ద్వారా లబ్ధి చేకూరిన విషయం మర్చిపోవద్దని జనానికి సూచించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ప్రచారంలో 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరుశురాములు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.